ఏపీ పెండింగ్ బిల్లులపై శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు.ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
సమాజ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.ట్యాక్స్ లతో రూ.90,900 కోట్ల ఆదాయం వస్తుంటే జీతాలు, పెన్షన్లకు రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు.ఉద్యోగులకు రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించామని వెల్లడించారు.పెన్షనర్ల బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని బుగ్గన స్పష్టం చేశారు.







