Ram Charan : చిరు, పవన్ తర్వాత రామ్ చరణ్ ఎక్కువగా గౌరవించేది ఎవరినో తెలుసా?

గత కొద్దీరోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లలో రామ్ చరణ్( Ram Charan ) కూడా ఒకటి.ఇటీవలె ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

 Ram Charan Tells About Oscar And Career-TeluguStop.com

అనంతరం రెండు రోజులు అక్కడే గడిపిన రామ్ చరణ్ భార్య ఉపాసన( upasana ) దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.అనంతరం తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు చెర్రీ.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చినందుకుగాను ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందిస్తూ చరణ్ కి శాలువాతో సత్కరించారు.

Telugu Rajamouli, Amit Shah, Oscar, Pawan Kalyan, Ram Charan, Tollywood, Upasana

ఆ తర్వాత చెర్రీ ఇండియా టుడే కాన్ క్లేవ్ 2023 సెషన్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.

నాన్న, బాబాయ్ పవన్ కళ్యాణ్ తరువాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరే.అతను మరెవరో కాదు డైరెక్టర్ రాజమౌళి.

మా ఇంట్లోకి వెళ్తే మా నాన్న నాకు ఎడమ కన్ను అయితే బాబాయ్ పవన్ కళ్యాణ్ కుడికన్నుతో సమానం.నాకు ఇద్దరు వేరువేరు కాదు ఒక్కటే అని తెలిపారు రామ్ చరణ్.

అనంతరం ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.ఆ సినిమాకు రాజమౌళి గారు నన్ను, తారక్ ని ఎంచుకోవడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం.

Telugu Rajamouli, Amit Shah, Oscar, Pawan Kalyan, Ram Charan, Tollywood, Upasana

కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించింది కావడంతో మా ఇద్దరికీ కరెక్ట్ గా సూట్ అవుతుందని గమనించి మా ఇద్దరిని సెలెక్ట్ చేశారు అని చెప్పుకొచ్చారు చరణ్.92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయికి వెళ్ళిన సినిమా లేదు.నామినేషన్స్ వరకు వెళ్లి ఉండొచ్చు కానీ ఈ స్థాయి క్రేజ్ వెళ్ళింది మాత్రం ఈ సినిమాతోనే.ఇదంతా కూడా రాజమౌళి చేసిన మ్యాజిక్ అని చెప్పుకొచ్చారు చెర్రీ.

ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించడం వెనుక ఎంతో కష్టం ఉంది.మా ఇద్దరికీ కూడా మా డైరెక్టర్ రాజమౌళి స్వీట్ గా టార్చర్ చూపించాడు.

మేము కూడా ఎంతో ఎంజాయ్ గా పని చేశాము.మా అందరి కష్టాల ఫలితమే ఈ ఆస్కార్ అవార్డు అని చెప్పకొచ్చారు రామ్ చరణ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube