రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన కొల్తూరి బాలమణి – కీ.శే.
అంజయ్య గార్ల కూతురు సవిత వివాహం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన ప్రవీణ్ తో ఈరోజు చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వివాహం జరగనుండగా పుస్తె మెట్టెలను అందించిన టి ఆర్ ఎచ్ ఎస్ ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నర్ర విద్యాసాగర్ రెడ్డి.
నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి తండ్రి చనిపోవడంతో కన్నతల్లి కూలినాలి చేసుకుంటూ కూతురిని పోషించుకుంటుంది.
ఆ నిరుపేద యువతి కుటుంబానికి అండగా నర్ర విద్యాసాగర్ రెడ్డి తనవంతు సాయంగా పుస్తె మెట్టెలను అందజేసారు.ఈ సందర్భంగా విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యాశీస్సులు నూతన వధూవరులపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్ర నరేష్ రెడ్డి, సర్పంచ్ హెంలా నాయక్, కోల్తూరి రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







