ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు గెలవడానికి రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి.అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో అధికార పార్టీ వైసీపీ( YCP ) నిర్ణయాలు తీసుకోవటంలో మంచి జోరు మీద ఉంది.ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత జగన్( jagan ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఏడాది నుండి రకరకాల పార్టీల కార్యక్రమాలతో ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలలో ఉండేలా చూసుకోవడం జరిగింది.
ఇదే సమయంలో నాయకుల పనితీరుపై రకరకాల సర్వేలు చేయించుకుని జాబితాలు కూడా విడుదల చేస్తున్నారు.ఈ జాబితాలలో కొంతమందికి స్థానచలనం ఇన్చార్జిల మార్పులు చేస్తున్నారు.
ఈ రకంగా నాలుగు జాబితాలలో 59 అసెంబ్లీ స్థానాలు 9 ఎంపీ స్థానాలలో మార్పులు చేయడం జరిగింది.కాగా తాజాగా ఐదో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana )ప్రకటించారు.7 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ (4ఎంపీ, 3 ఎమ్మెల్యే) స్థానాల పేర్లు వెల్లడించారు.కాకినాడ ఎంపీ- చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ- సింహాద్రి రమేశ్ బాబు, నరసరావుపేట ఎంపీ-అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ-గురుమూర్తి, సత్యవేడు (ఎమ్మెల్యే)-నూకతోటి రాజేష్, అరకు వ్యాలీ(ఎమ్మెల్యే)-రేగం మత్స్యలింగం, అవనిగడ్డ (ఎమ్మెల్యే)- సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు.
ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ లోకసభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించినట్లు ప్రకటన విడుదల చేయడం జరిగింది.మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన ఈ ఐదవ జాబితాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్చార్జిల మార్పు చేయడం జరిగింది.