టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా ఫలితాలు మావే.సీఎం జగన్ పాలనకు నిదర్శన మంత్రి అనిల్ కుమార్ ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కేసులతో ఎన్నికలు రద్దు కోసం ప్రయత్నం చేశాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనిల్ కుమార్ ఆదివారం మీడియాతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అధిక స్థానాలను వైఎస్ఆర్సీపీ సొంతమయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అన్నారు.
ఈ ఫలితాలే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన నిదర్శనమని తెలిపారు.కాగా తము ఎన్నికలను బహిష్కరించాం అంటున్న నేతలకు సిగ్గుందా.! అని సూటిగా ప్రశ్నించారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టి ప్రసారం చేసింది కానీ ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి మారిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు టీడీపీ వైపు ఎంద్కుంటారు.ఆయా వర్గాలకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలనకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు.
ప్రజలంతా వైయస్ జగన్ ను గుండెల్లో పెట్టుకుని తీర్పునిచ్చారని అన్నారు.కొందరు నాయకులు హైదరాబాదులో ఉంటే మంచిదని ఎక్కడ అడుగుపెడితే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్రలు చేయాలనుకునేవారికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు.మున్సిపాలిటీ పంచాయతీ ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని చెప్పారు.
చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు.అసలు ఆయా చోట్ల ఆ పార్టీకి ఒక్కరు కూడా నామినేషన్ వేయడానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు.