విజనరీ లీడర్ అంటూ చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి( Chandrababu ) మధ్యంతర బెయిల్ రావడం తెలిసిందే.దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ( Rajahmundry Central Jail )ఉన్న చంద్రబాబు నేడు విడుదల కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.

 Minister Ambati Rambabu Satirizes Chandrababu Getting Interim Bail Details, Tdp,-TeluguStop.com

ఈ క్రమంలో జైలు నుంచి బయటకు విడుదల అవగానే చంద్రబాబు చాలా ఎమోషనల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.జైల్లో ఉన్న సమయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు.

నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదు ఎవరిని తప్పు చేయనివ్వను అని పేర్కొన్నారు.ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ప్రజల అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ వ్యాప్తంగా తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలా ఉంటే చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.“విజనరీ లీడర్ కి విజన్ సరి చేసుకోమని” బెయిల్ ఇచ్చారు.అంటూ ట్వీట్ చేశారు.అంతకుముందు “వస్తున్న మీకోసం కాదు.వస్తున్న కంటి ఆపరేషన్ కోసం” అని, “నిజం గెలిచి కాదు బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్” అంటూ వరుస పెట్టి ట్వీట్ లు చేస్తున్నారు.మరో పక్క చంద్రబాబు విడుదల కావడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube