తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. !?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజలను తీవ్రంగా కుమ్ముకుంటున్న వేళ లేటుగా కళ్లు తెరచిన అధికారులు ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఏ మేరకు కరోనా కంట్రోల్ అవుతుందో తెలియదు గానీ ఈ కర్ఫ్యూ విషయంలో మాత్రం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ఫ్యూ సమయంలో మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వ నిర్ణయం పేదలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ట్వీట్ చేశారు.ఇదిలా ఉండగా రాష్ట్ర అధికారాల మీద కేంద్రం కొత్త రకమైన ఆక్రమణలకు పాల్పడుతోందని, కోర్టులు విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపుతోందంటూ ట్వీట్ చేశారు.

కాగా ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సమయాన్ని రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించాలని, పాలు, ఇతర అవసరమైన ఆహార పదార్థాలను కూడా మినహాయింపునిచ్చే సర్వీసుల్లో చేర్చాలని కోరారు అసదుద్దీన్.

ఇది కదా ట్రెండ్ అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వంటమనిషి సీవీ
Advertisement

తాజా వార్తలు