మజ్లిస్ తో కాంగ్రెస్ దోస్తీ.. అందుకేనా ?

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయా ? ఉప్పు నిప్పు లా ఉండే కాంగ్రెస్( Congress ) ఏంఐఏం పార్టీలు స్నేహబంధానికి తెర తీస్తున్నాయా ? మరి బి‌ఆర్‌ఎస్ సంగతేంటి ? ప్రస్తుతం ఈ ప్రశ్నలే తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని ఏంఐఏం పార్టీ బి‌ఆర్‌ఎస్ తో పొత్తులో కొనసాగుతూ వచ్చింది.

 Mim-congress Alliance, Asaduddin Owais , Mim, Congress , Revanth Reddy, Brs, Ts-TeluguStop.com

ఈసారి ఎన్నికల ముందు కూడా బి‌ఆర్‌ఎస్ మరియు మజ్లిస్ పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేశాయి.కానీ అనూహ్యంగా కాంగ్రెస్ 63 సీట్లు సాధించి అధికారంలోకి రావడం, బి‌ఆర్‌ఎస్ 39 సీట్లకే పరిమితం కావడం, ఏంఐఎం 7 సీట్లతో సరిపెట్టుకోవడంతో రాజకీయాలు తారుమారయ్యాయి.

అయితే ఎన్నికల ముందు మజ్లిస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్.విజయం తరువాత స్నేహహస్తం అందిస్తోంది.

Telugu Asaduddin Owais, Congress, Revanth Reddy, Ts-Politics

మజ్లిస్ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రోటెం స్పీకర్ గా బాధ్యతలు అప్పగించడం చూస్తే ఏంఐఏం మరియు కాంగ్రెస్ పార్టీలు స్నేహబంధం కోసం అరతపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.దీని వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవాదని బి‌ఆర్‌ఎస్ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలను బి‌ఆర్‌ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం కే‌సి‌ఆర్ ( KCR )చేసే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

Telugu Asaduddin Owais, Congress, Revanth Reddy, Ts-Politics

అదే గనుక జరిగితే కాంగ్రెస్ లోని కొంతమంది ఎమ్మేల్యేలు, ఏంఐఏం ఏడు స్థానాలను కలుపుకొని బి‌ఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఆశ్చర్యం లేదు.ఆ భయంతోనే మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ స్నేహబంధానికి తెర తీసిందనేది కొందరి అభిప్రాయం.అయితే మొదటి నుంచి బి‌ఆర్‌ఎస్ పక్షాన ఉన్న ఏంఐఏం కాంగ్రెస్ తో ఎంతవరకు చేతులు కలుపుతుందనేది ప్రశ్నార్థకమే.అయితే ఈ రెండు పార్టీల మద్య అధికారిక పొత్తు కష్టమే అయినప్పటికి అనధికారిక స్నేహం కొనసాగే అవకాశం ఉందనేది గట్టిగా వినిపిస్తున్న మాట.మొత్తానికి మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్( MIM ) దగ్గర కావడం తెలంగాణ రాజకీయాల్లో అసక్త్ఝికర పరిణామమే.మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube