కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే ఫాషన్ రంగంలో ఉండే మహిళలు ఈ మాస్క్ లని కూడా తమ క్రియేటివిటీతో తమకి ఒక అలంకరణగా మార్చేసుకుంటారు.
ఇప్పుడు అదే జరుగుతుంది.పెళ్లి అంటే అదో అందమైన వేడుక అంత అందమైన వేడుక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా అమ్మాయిలు ప్లాన్ చేసుకుంటారు.
ముందుగానే ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ ప్లాన్ చేసుకుంటారు.మంచి మంచి డిజైనర్ దుస్తులతో ఫోటోషూట్ లు చేసుకుంటారు.
పెళ్లి సమయంలో స్పెషల్ గా ఫోటోలకి పోజులు ఇచ్చే సమయం ఉండదు కాబట్టి ముందుగానే ఇలా ప్లాన్ చేసుకుంటారు.అయితే ఇప్పుడు వారి డిజైన్స్ లోకి మార్కులు కూడా చేరిపోయాయి.
మ్యాచింగ్ డిజైన్ దుస్తులకి మ్యాచింగ్ మాస్కులు వేసుకుంటూ ఫోటోషూట్ లు చేసుకుంటున్నారు.ఇప్పటికే పెద్దవారి పెళ్లి వేడుకలలో ఇలాంటి మ్యాచింగ్ మాసుకులు ట్రెండ్ కనిపిస్తుంది.
తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు రానా, మిహికా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరిగింది.ఆగస్ట్ 8న వీరిద్దరు ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు.పెళ్లి వేడుకకి ఫలక్నుమా ప్యాలస్ సిద్ధం అవుతుంది.ఇప్పటికే రెండు కుటుంబాల వారు పెళ్లి వేడుకలో బిజీ అయిపోయారు.
శుభలేఖలు పంచుకుంటున్నారు.ఈ వేడుకల్లో భాగంగా జరిగిన ఓ ఫొటోషూట్‌ని మిహికా షేర్ చేశారు.
డిజైనర్ డ్రెస్, డిజైనర్ నగల్లో మిహికా మెరిసిపోయారు.ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ బాగా జరగడానికి కారణం అవుతున్న అందరికీ ధన్యవాదాలు.
ఇది నాకు చాలా చాలా స్పెషల్ డే అంటూ ఆ ఫోటోలను పోస్ట్ చేశారు.కాగా, డ్రెస్‌కి మ్యాచింగ్‌గా డిజైనర్ మాస్కులు కూడా మిహికా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు.
మాస్క్ తో ఆమె తీయించుకున్న ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.