షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే!

ప్రస్తుతం సినిమా రంగంలో బ్యాగ్రౌండ్ తో సంబంధం లేకుండా కొంతమంది స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సెలబ్రిటీలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలుగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

 Middle Range Heroes Short Film Journey Details Here Goes Viral,vijay Devarakond-TeluguStop.com

ప్రస్తుతం విజయ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.అయితే విజయ్ పెళ్లి చూపులు సినిమాకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.

2011 సంవత్సరంలో విజయ్ దేవరకొండ కొంచెం టచ్ లో ఉంటా అనే అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారడంతో పాటు తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

మరో ప్రముఖ నటుడు సుహాస్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.కలర్ ఫోటో అనే సినిమాతో సుహాస్ కు నటుడిగా మంచి పేరు వచ్చింది.

Telugu Konchemtouch, Pelli Choopulu, Short, Suhas, Actors-Movie

ప్రస్తుతం సుహాస్ హీరోగా పలు సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే సుహాస్ స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మరో ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

Telugu Konchemtouch, Pelli Choopulu, Short, Suhas, Actors-Movie

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పోలిశెట్టి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ప్రముఖ బ్యానర్లలో నవీన్ పోలిశెట్టి సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube