అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి, భారత సంతతికి చెందిన కమలా హారిస్ ( Kamala Harris )దూసుకెళ్తున్నారు.బైడెన్ తప్పుకోవడంతో అనూహ్యంగా అధ్యక్ష బరిలో నిలిచిన ఆమె.
ప్రచారం, ఫండ్ రైజింగ్ సహా పలు అంశాల్లో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )కంటే ముందంజలో ఉన్నారని అమెరికన్ మీడియాలో అంటోంది.భారత సంతతి, నల్లజాతి, దక్షిణాసియా సంతతి కమలా హారిస్‌కు మద్ధతుగా నిలుస్తుండగా.
కార్పోరేట్ ప్రపంచం డొనాల్డ్ ట్రంప్‌కు వెన్నుదన్నుగా ఉంది.టెస్లా అధినేత , బిలియనీర్ ఎలాన్ మస్క్ అయితే బహిరంగంగా తన మద్ధతును ట్రంప్‌కు ప్రకటించడంతో పాటు మాజీ అధ్యక్షుడితో కలిసి స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ఇలాంటి నేపథ్యంలో కమలా హారిస్‌కు ఓ బడా వ్యాపారవేత్త మద్ధతు ప్రకటించారు.ఆయనెవరో కాదు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్( Bill Gates ).కమలకు మద్ధతిచ్చే ఓ ఎన్జీవో సంస్థకు గేట్స్ భారీగా విరాళం ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి.దీనిని బట్టి ఫ్యూచర్ ఫార్వర్డ్ అనే సంస్థకు బిల్‌గేట్స్ దాదాపు 50 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.420 కోట్లు) ప్రకటించారట.
నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన మద్ధతు ఎవరికి అనేది గేట్స్ ఇప్పటి వరకు వెల్లడించలేదు.కాకపోతే ట్రంప్ మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపడితే అమెరికాలో పరిస్థితులు మరింత దిగజారతాయని బిల్‌గేట్స్ తన సన్నిహితులతో అన్నట్లుగా కథనాలు వస్తున్నాయి.అయితే ఎన్నికల్లో జో బైడెన్ ( Joe Biden )తప్పుకుని కమలా హారిస్ అభ్యర్ధిగా రావడంతో బిల్‌గేట్స్ చాలా సంతోషించారు.
ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
అయితే ఆయన మాజీ భార్య మెలిండా గేట్స్ మాత్రం కమలా హారిస్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.తాజా విరాళంపై బిల్‌గేట్స్ మాట్లాడుతూ.ఆరోగ్య సంరక్షణ, పేదరికం, యుద్ధ వాతావరణంలో మార్పులు తీసుకొచ్చిన వారికే తన మద్ధతు అన్నారు.
ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు చాలా భిన్నమైనవని బిల్‌గేట్స్ అభివర్ణించారు.