మహిళల ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది.పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ జట్టు నేరుగా ఫైనల్ చేరింది.
పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచిన ముంబై( Mumbai ) జట్టుకు, పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచిన బెంగళూరు( Bengaluru ) జట్టుకు మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఫైనల్ పోరులో ఢిల్లీతో తలపడనుంది.
బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య నేను జరిగే మ్యాచ్ చాలా అంటే చాలా ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, 2023 సీజన్లో నిరాశపరిచిన బెంగళూరు జట్టు కొత్తగా ఫైనల్ చేరేందుకు ఆరాటపడుతోంది.
నేడు జరిగే మ్యాచ్లో ముంబై జట్టు గెలిస్తే 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది.ఒకవేళ బెంగళూరు జట్టు గెలిస్తే 2023 సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ( Delhi Capitals ) టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది.

గత సీజన్ తో పోలిస్తే బెంగళూరు జట్టు చాలా మెరుగుపడింది.లీగ్ ఆరంభ దశలోనే యూపీ వారియర్స్, గుజరాత్ జాయింట్స్ పై ఘనవిజయం సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చింది.ఆ తర్వాత కాస్త తడబడి చివరికి పాయింట్లు పట్టికలో మూడవ స్థానంలో నిలబడి ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది.లీక్ దశలో బెంగళూరు జట్టు తన ఆఖరి మ్యాచ్లో ముంబై జట్టును చిత్తుగా ఓడించింది.
బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ ఎలీస్ పెరీ ఆల్ రౌండ్ షోతో ముంబై జట్టు చిత్తుగా ఓడటంలో కీలక పాత్ర పోషించింది.ఇక రిచా ఘోష్ హిట్టింగ్ తో జట్టులో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇక వీరితోపాటు సోఫీ డివైన్, జార్జియా వేర్ హమ్ లు కూడా రాణిస్తే ముంబై జట్టుకు ఇబ్బందులు తప్పవు.ముంబై జట్టు విషయానికి వస్తే.హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్, ఆమెలికా కేర్ ల బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగుళూరు జట్టును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.2024 సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ మినహాయిస్తే ఓవరాల్ గా ముంబై జట్టు అద్భుతంగా రాణించింది.ప్రస్తుతం బెంగుళూరు, ముంబై జట్లు నేటి మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.







