తెలుగు రాష్ట్రాలలో అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న ప్రధాన నూనె పంటలలో పొద్దు తిరుగుడు పంట( Sunflower Cultivation ) కూడా ఒకటి.వర్షాధార పంటగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేయవచ్చు.
ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది.నీటిపారుదల కింద అయితే పొద్దుతిరుగుడు పంటను సంవత్సరం పొడుగునా ఏ కాలంలో అయినా పండించవచ్చు.
అయితే పొద్దుతిరుగుడు పంట పూత, గింజ తయారయ్యే దశలో ఉంటే పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల కంటే ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఖరీఫ్ లో కంటే రబీలో సాగు చేస్తేనే అధిక దిగుబడు( High yield)లు పొందే అవకాశం ఉంది.రబీలో సాగు చేస్తే జనవరి రెండవ వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తనం విత్తుకోవాలి.నీటిపారుదల కింద సాగు చేస్తే.
విత్తేటప్పుడు 35 కిలోల నత్రజని 35 కిలోల భాస్వరం 12 కిలోల పొటాష్ ఎరువులు( Potash fertilizers ) వేయాలి.పంట 30 రోజుల దశలో ఉన్నప్పుడు 18 కిలోల యూరియా వేయాలి.
పంట 50 రోజుల దశలో ఉన్నప్పుడు 18 కిలోల యూరియా వేయాలి.ఈ ఎరువులు పంటకు అందిస్తున్నప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి.
ఇక ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు ఆకరి దక్కిలో వేసుకోవాలి.

పొద్దు తిరుగుడు పంట సాగు చేసే నేలలో గంధకం తక్కువగా ఉంటే ఒక ఎకరం పొలంలో పది కిలోల గంధకం( Sulfur)ను జిప్సం రూపంలో అందించాలి.దీంతో నూనె శాతం పెరిగి దిగుబడులు పెరిగా అవకాశం ఉంది.పొద్దు తిరుగుడు పంటకు నెక్రోసిస్ తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.
ఈ తెగుళ్లు పంట ఏ దశలో ఉన్న కూడా ఆశించే అవకాశం ఉంది.ఈ తెగుళ్లు ఒక వైరస్ ద్వారా పంటకు వ్యాపిస్తుంది.
పొద్దుతిరుగుడు మొక్క ఆకుల మధ్య ఈనే దగ్గరగా ఉండే భాగం ఎండిపోయి క్రమంగా బూడిద రంగులో కుమారి ఆ తర్వాత నల్లగా మారి వంకలు తిరిగితే ఈ తెగుళ్లు సోకినట్టే.పంట పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగుళ్లు ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.
ముఖ్యంగా ఈ తెగుళ్లు సోకిన తర్వాత తామర పురుగుల వల్ల పొలమంతా వ్యాపించే అవకాశం ఉంది.కాబట్టి వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకుని ఈ తెగులను అరికట్టాలి.







