తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నక్సలిజానికి సంబంధించిన సినిమాలు చేయడంలో ఆర్.నారాయణమూర్తి( R Narayana Murthy ) ముందు వరుసలో ఉండేవాడు.
ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా కమ్యూనిజం గురించి ఆయన చెప్పే భావజాలం ప్రేక్షకులందరికి నచ్చేది.ఇక ప్రతి సినిమా కూడా ఉద్యమంలా ఉండేది ముఖ్యంగా పేదవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని అనే సీన్ల ను కండ్ల కి కట్టినట్టు చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేంత లా పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈయన సినిమాలు( Movies ) పెద్దగా ఆడకపోవడంతో ఈయన మార్కెటు భారీగా డౌన్ అయింది.

ఇక దాంతో ఏం చేయాలో తెలియక ప్రస్తుతం కొన్ని సినిమాలను చేసే పనిలో బిజీగా మారిపోయాడు.ఇక ఇలాంటి క్రమం లోనే పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా టెంపర్( Temper ) సినిమాలో ఆర్ నారాయణ మూర్తిని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా నటిస్తే మంచి బాగుంటుంది అని ఆయన్ని అడిగాడు కానీ ఆయన నటించలేదు.అయితే ఆర్ నారాయణ మూర్తి వదులుకున్న క్యారెక్టర్లలో టెంపర్ సినిమాలో చేసిన క్యారెక్టర్ ఒకటి అవ్వగా, పిల్లా నువ్వు లేని జీవితం సినిమా( Pilla nuvvu leni jeevitham )లో జగపతి బాబు చేసిన క్యారెక్టర్ కూడా ఆర్ నారాయణ మూర్తి వదులుకున్నట్లు గా సమాచారం అయితే వస్తుంది.

ప్రస్తుతం ఆయన ఎవరి సినిమాలు చేయకుండా తను హీరోగా మాత్రమే సినిమాలు చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఇది ఇలా ఇప్పుడు చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడం పక్క అంటూ ఇప్పటికే ఆయన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నాడు.మరి ఆయన సినిమాలకు ఈరోజుల్లో డిమాండ్ అయితే తగ్గుతుంది.మరి ఇలాంటి సమయంలో ఆయన సినిమాలు ఎంతవరకు మెప్పిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







