ఉల్లి పంట( ( Onion cultivation ) )ను ఆశించే తెల్ల కుళ్ళు తెగులు ( White Rot )ఒక శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది.
ఈ తెగులు నేలలోనుంచి మొక్కను ఆశించి నాశనం చేస్తాయి.
భూమిలో ఉండే ఈ తెగులకు సంబంధించిన శిలీంద్రాలను అరికట్టడం చాలా కష్టం.ఉల్లికి తీవ్ర నష్టం కలిగించే తెగులలో ఈ తెల్ల కుళ్ళు తెగులు కీలకపాత్ర పోషిస్తాయి.
నీరు, పనిముట్ల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి.ఉల్లి మొక్క ఆకుల యొక్క పై అంచులు పసుపు రంగులోకి మారి వాలిపోతే ఈ తెల్ల కుళ్ళు తెగుళ్లు సోకినట్లు నిర్ధారించుకోవాలి.
అంతేకాకుండా మొక్కల మొదల వద్ద నల్లని మచ్చలు ఏర్పడి, దూది లాంటి తెల్లని శిలీంద్రం అక్కడ పెరగడం గమనించవచ్చు.తరువాత క్రమంగా వేర్లతో సహా మొక్క కుళ్ళిపోయి, ఉల్లిగడ్డలు క్షీణిస్తాయి.
ముఖ్యంగా గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే పంట ఏ దశలో ఉన్న కూడా ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంది.కాకపోతే ఈ తెగుల లక్షణాలు మొక్క పైనుంచి కిందికి పాకి ఉల్లిగడ్డను కుళ్ళింప చేస్తాయి.
ఉల్లిగడ్డ మొక్కలలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే పీకి పంట నుండి వేరు చేయాలి.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల భూమిలో ఉండే ఈ తెగులకు సంబంధించిన శిలింద్రాలు దాదాపుగా సూర్యరశ్మి(Sunshine )కి నాశనం అవుతాయి.తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి.
ఇక తొలిదశలోనే రసాయన మందులను ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టాలి.టేబుకొనేజోల్, పెందాయోపైరాడ్, ప్లూడియోక్సోనిల్, ఇప్రొడియోన్ లాంటి వాటిని ఉల్లినారు నాటడం కంటే ముందే నేలలో వేస్తే ఈ తెగులు వచ్చే అవకాశం ఉండదు.ఒకవేళ పంట వేశాక ఈ తెగుల లక్షణాలు కనిపిస్తే ఈ రసాయన మందులనే ఉపయోగించి పిచికారి చేసి వెంటనే నివారించాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy