పండు మిరపను ఆశించే కోవనేఫోరా ఎండు తెగులను అరికట్టే పద్ధతులు..!

పండు మిరప సాగును( Chilli Crop ) ఈ కోవనేఫోరా ఎండు తెగులు గాలి ద్వారా, నీటి ద్వారా, పనిముట్ల ద్వారా పంటను ఆశించే అవకాశం ఉంది.ముఖ్యంగా పొలంలో పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల పనిముట్ల వల్ల మొక్కలకు గాయాలు అయినప్పుడు వీటి వ్యాప్తి అధికంగా ఉంటుంది.

 Methods To Prevent Choanephora Dry Rot In Chilli Crop Details, Choanephora Dry-TeluguStop.com

వర్షాకాలంలో కనుక ఈ తెగులు సోకితే పంటలో ఊహించని నష్టం వాటిల్లుతుంది.

ఈ తెగులు మొక్క పై భాగాన్ని ఆశించి తర్వాత మొక్క కింది భాగానికి వ్యాప్తి చెందుతాయి.

ఆకులు ముదురు పసుపు రంగులోకి మారి తర్వాత కుళ్ళిపోతాయి.పండుమిరప కింద భాగం గోధుమ రంగు నుండి నలుపు రంగులోకి మారుతుంది.

ముందుగా ఈ తెగులు సోకిన వెంటనే పూత, పిందెలు వాలిపోయి ఎండిపోతాయి.ఇక మొక్క కాండం గోధుమ రంగులోకి మారి ఆ తర్వాత నలుపు రంగులోకి మారి కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది.

Telugu Agriculture, Chilli Crop, Chillicrop, Chilli Farmers, Choanephoradry, Dry

పంట పొలంలో ఎప్పటికప్పుడు ఈ తెగుల లక్షణాలను గమనిస్తూ ఉండాలి.ఏవైనా మొక్కలకు ఈ తెగులు( Pest ) సోకిన అనుమానం కలిగిన వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.మొక్కల ఆకులు నీటికి తడవకుండా ఎక్కువ పొడిగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.మొక్కల మధ్య సూర్యరశ్మి బాగా ఉండేటట్లు కాస్త దూరంగా నాటుకుంటే ఇలాంటి తెగులను దాదాపుగా అరికట్టినట్టే.

ఇక పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపు ను తొలగించాలి.

Telugu Agriculture, Chilli Crop, Chillicrop, Chilli Farmers, Choanephoradry, Dry

ఇక వ్యాధి నిరోధకత, తెగులను తట్టుకునే మిరప నారను పొలంలో నాటుకోవాలి.అధిక మోతాదులో పోషకాలను వాడకూడదు.ఎందుకంటే మొక్క గుబురుగా పెరుగుతుంది.

భూమిలో ఉండే తేమ శాతాన్ని( Moisture ) బట్టి నీటి తడులు అందించాలి.ఇక ఈ తెగులను పంట పొలంలో గుర్తించిన తర్వాత కచ్చితంగా వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాల మేరకే రసాయన పిచికారి మందులను వాడాలి.

సాధారణంగా మార్కెట్లో ఈ తెగులు నివారించేందుకు అనేక రకాల రసాయన పిచికారి మందులు అందుబాటులో ఉన్నాయి.కానీ కొన్ని రకాల మందుల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఈ తెగులు సోకిన మొక్కను వ్యవసాయ క్షేత్రం నిపుణులకు చూపించి వారి సలహా మేరకు రసాయన పిచికారి మందులు వాడి పంటను సంరక్షించుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube