వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా: రేవంత్ రెడ్డి

వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 One Nation One Party Is Bjp's Secret Agenda: Revanth Reddy-TeluguStop.com

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోరాడే వారికి భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.రాజకీయ భవిష్యత్ కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదికని చెప్పారు.

డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని అన్నారు.దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని ఆరోపించారు.

త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయన్న ఆయన సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు.అక్టోబర్ 2 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని పేర్కొన్నారు.ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube