వాట్సప్ లో మెటా ఏఐతో ఛాటింగ్ ఎలా చేయాలంటే..?

ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్( Artificial Intelligence ) వాట్సప్ లోకి వచ్చేసింది.భారతదేశంలో ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు వాట్సాప్ లో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తోంది.

మెటా రూపొందించిన అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో వాట్సప్( Whatsapp ) యూజర్లు ఎలాంటి ప్రశ్నలు అయినా అడగవచ్చు.మెటా ఏఐ దగ్గర కావలసిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

అయితే ప్రస్తుతానికి సరదాగా మాత్రమే ప్రశ్నలు అడగడం మంచిది.పర్సనల్ విషయాలను దీనితో షేర్ చేయకుండా ఉండడం ఉత్తమం.

ఎందుకంటే.మనం ఏఐ తో జరిపే సంభాషణ డేటాను ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అనేది తెలియదు.

Meta Starts Testing Ai Chatbot For Whatsapp,whatsapp,meta Ai,ai,chatbot,technolo
Advertisement
Meta Starts Testing AI Chatbot For WhatsApp,WhatsApp,Meta AI,AI,Chatbot,Technolo

వాట్సప్ యాప్ తెరవగానే పైన మెటా ఏఐ( Meta AI ) అని, దాని కింద with Llama అని కనిపిస్తుంది.దీనిని ఓపెన్ చేస్తే Ask Meta Al anything కనిపిస్తుంది.దాని కింద కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఏఐ ఫీచర్ కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది.ప్రస్తుతానికి ఇంగ్లీష్ భాష( English Language )ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

వాట్సప్ లో మెటా ఏఐతో ఛాటింగ్ ఎలా చేయాలంటే.వాట్సప్ యాప్ తెరవగానే పై భాగంలో కుడి వైపున ఒక గుండ్రటి ఐకాన్ కనిపిస్తుంది.

దానిని క్లిక్ చేస్తే టర్మ్ అండ్ కండిషన్స్ తెరపైకి వస్తాయి.వాటిని పూర్తిగా చదివి యాక్సెప్ట్ చేయాలి.

Meta Starts Testing Ai Chatbot For Whatsapp,whatsapp,meta Ai,ai,chatbot,technolo
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఇక స్క్రీన్ పై కనిపించే ప్రాంప్ట్ ను ఎంచుకోవాలి.ఒకవేళ కావాలంటే మీకు ఏదైనా సందేహం ఉంటే అక్కడ పేస్ట్ చేయవచ్చు.ఇక సెండ్ బటన్ నొక్కితే చాలు మీరు ఏఐతో సంభాషణ ప్రారంభించవచ్చు.

Advertisement

మెటా ఏఐ జనరేట్ చేసిన సమాధానాలను లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ గుడ్ రెస్పాన్స్( Good Response ) , బ్యాడ్ రెస్పాన్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.యూజర్లు తమ అభిప్రాయాన్ని అక్కడ షేర్ చేయవచ్చు.

అయితే ఏఐ జనరేట్( AI Generate ) చేసిన కొన్ని సమాధానాలు తప్పుడు సమాధానాలు అయ్యే అవకాశం కూడా ఉందని ముందుగానే వాట్సప్ హెచ్చరిస్తుంది.ప్రస్తుతం వాట్సాప్ తన వినియోగదారుల నుంచి ఏఐ చాట్ బుక్ కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటుంది.

తాజా వార్తలు