చంద్రగిరి… మోహన్ బాబు యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీలో పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పంద కార్యక్రమం జరిగింది.IBM, SAP, L&T, Edu_Tech, Nanochip సొల్యూషన్స్ అకడమిక్ సహకారంతో ఇండస్ట్రీ సహకార డిగ్రీ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించినట్లు సిఈఓ మంచు విష్ణు తెలిపారు.
చంద్రగిరి మండల పరిధిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రముఖ కంపెనీలతో ఒప్పంద కార్యక్రమం సిఈఓ మంచు విష్ణు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు ఆన్లైన్ కోర్సులను అందుబాటులో ఉంచడానికి కోర్సెరాతో MOU సంతకం చేయడమైందన్నారు.
IBM, SAP, L&T, Edu_Tech, Nanochip సొల్యూషన్స్ అకడమిక్ సహకారంతో ఇండస్ట్రీ సహకార డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రారంభించడం ఒక్క మోహన్ బాబు యూనివర్సిటీ కే దక్కిందని పేర్కొన్నారు.భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ కి కేరాఫ్ అడ్రస్ గా మోహన్ బాబు యూనివర్సిటీ ఉండబోతోందని చెప్పారు.
ఓ ప్రైవేట్ యూనివర్సిటీ తో ప్రముఖ కంపెనీలు ఒప్పందం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు మంచు విష్ణు… విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటకు వెళ్లగానే ఉద్యోగం లేక పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేయించడం మోహన్ బాబు యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.