కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోవాల్సిందే.కొత్త వారు సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంటే పాతవారు రిటైర్ అవ్వలసిందే.
ఏళ్లకు ఏళ్ళు ఇండస్ట్రీ ని పట్టుకొని వేలాడుతూ ఉంటె మనకే తెలియకుండా మనల్ని జనాలు మర్చిపోయి పక్కన పెట్టేస్తారు.ఇలాంటి ఒక పోలికే ఇద్దరు మెగా స్టార్స్ విషయంలో కూడా జరుగుతుంది.
తమను ఈ తరం వారు గుర్తించడం లేదు కాస్త నిరాశకు గురి అవుతున్నారు.
అయినా కూడా చివరి శ్వాస వరకు నటించాలనే ఉద్దేశంతో ఏదోలా నెట్టుకోస్తు తమ బండిని లాగుతున్నారు.
కొన్ని సార్లు ఆలా వారి సినిమాలు వర్క్ అవుట్ అవుతన్న కాలక్రమేణా కొత్త తరం యువత సీనియర్స్ ని గుర్తించడం లేదు అనే విషయం వాస్తవం.ఆలా నైరాణ్యం లో ఉన్న మొదటి మెగాస్టార్ చిరంజీవి.
సైరా, ఆచార్య సినిమాల ఫలితం ఆయన్ని వాస్తవలోకంలోకి తీసుకారాలేక పోతుంది.
తనకు వయసు మీరింది అనే విషయాన్నీ లేట్ గా గ్రహించిన ఆ స్టేర్ ఇమేజ్ చట్రం లో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
అయితే తమ తరం పని అయిపోయిందన్న విషయాన్నీ తొలుత బయట పెట్టింది చిరంజీవి కావడం విశేషం.ఇంట్లో ప్రతి వారాంతం ఎదో ఒక పార్టీ జరుగుతూనే ఉంటుంది.
పార్టీ అంటే మ్యూజిక్ ఆడాల్సిందే.
![Telugu Acharya, Amitab Bacchan, Amitabbachhan, Chiranjeevi, Megas, Senior Heroes Telugu Acharya, Amitab Bacchan, Amitabbachhan, Chiranjeevi, Megas, Senior Heroes](https://telugustop.com/wp-content/uploads/2022/11/megastars-chiranjeevi-and-amitab-bachhan-who-are-getting-fade-out-in-times-detailsa.jpg )
చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ వంటి యువ హీరోలు ఉన్న మెగా కుటుంబంలో మ్యూజిక్ అనగానే ఒకప్పుడు మెగాస్టార్ పాటలు పెట్టుకునే వారట.కానీ ఇప్పుడు ఆయన్ని పక్కకు పెట్టేసి నేటి హీరోల మ్యూజిక్ ని ఇష్టపడుతున్నారు.తానొకడ్ని ఉన్నానన్న విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదు అంటూ చమత్కారంగా ఒక ఇంటర్వ్యూ లో తన పరిస్థితిని వివరించాడు చిరు.ఇక తరహా అభిప్రాయం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఎదుర్కొంటున్నాడు.80 ఏళ్ళ వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు చేస్తున్నాడు అమితాబ్.
![Telugu Acharya, Amitab Bacchan, Amitabbachhan, Chiranjeevi, Megas, Senior Heroes Telugu Acharya, Amitab Bacchan, Amitabbachhan, Chiranjeevi, Megas, Senior Heroes](https://telugustop.com/wp-content/uploads/2022/11/megastars-chiranjeevi-and-amitab-bachhan-who-are-getting-fade-out-in-times-detailss.jpg )
ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం అయితే వదలడం లేదు.అయితే తాను హీరోగా ఒక వెలుగు వెలిగిన తరుణంలో అమితాబ్ ని కలవడానికి ప్రతి ఆదివారం సందర్శకులకు అనుమతి ఉండేది.తన ఇంటి ప్రాంగణం లో జల్సా అనే భవనాన్ని అభిమానుల కోసం కట్టుకున్నాడు.అప్పట్లో వందల్లో, వేళల్లో జనాలు వచ్చేవారు.కానీ మెల్లిగా జనల తాకిడి తగ్గింది.ఇప్పుడు అయితే వేళ్ళ మీద లెక్క పెట్టేంత మంది కూడా రావడం లేదు.
వచ్చే వారు కూడా వయసు పైబడిన వారే అంటూ తన వయసు పై తన పర్సనల్ బ్లాగ్ లో రాసుకున్నాడు అమితాబ్.