మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ యండమూరి వీరేంద్రనాథ్( Chiranjeevi vs Yandamuri Veerendranath )… వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.నిజానికి చిరంజీవి ఎవరిని నొప్పించే విధంగా ప్రసంగాలు చెయ్యడు… పబ్లిక్ స్పీచ్ లు ఇవ్వడు.
తను యదాలాపంగా కొన్ని మర్చిపోతూ ఉంటాడు.కొన్నిసార్లు తను చెప్పాలనుకున్న విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబును ముందుకు తోసి మరి చెప్పిస్తాడు లేదంటే అల్లు అరవింద్ ఎలాగూ ఉండనే ఉన్నాడు.
చిరంజీవి వ్యవహార శైలి మెచ్చుకోకుండా ఉండలేం ఆయన వివాదాల జోలికి అయితే పోడు కానీ వివాదాలు మాత్రం ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) చేతిలో యండమూరి ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ మరోసారి గరికపాటి ఇలా రకరకాల టైంలో రకరకాల వ్యక్తులతో పేచీలు పెట్టుకొని మాటలు పడ్డవారే.సరే నాగబాబు చిరంజీవిలా సాఫ్ట్ కాదు కాబట్టి ఏదో ఒక వేదిక చూసుకొని నాలుగు డైలాగులు తిట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఒక న్యూస్ వైరల్ అయ్యేలా చిరంజీవి చేసిన పని ఉంది అదేంటంటే తన ఆత్మకథను యండమూరి రాయబోతున్నారు అంటూ చెప్పడం.చిరంజీవి ఆత్మకథ( Chiranjeevi Biopic ) రాయడానికి యండమూరి ఒప్పుకున్నాడా లేదా అనేది మరో విషయం అయితే గతంలో విరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది.
రామ్ చరణ్( Ram Charan ) విషయంలో అసలు గొడవ మొదలైంది.దవడ బాగా లేకపోతే రామ్ చరణ్ కి తన తల్లి సర్జరీ చేయించింది అనేది చాలా నవ్వుతూ క్యాజువల్ గా యండమూరి ఒక పబ్లిక్ స్పీచ్ లో చెప్పారు.
దాన్ని అవమానంగా భావించింది మెగా క్యాంప్ అందుకే యండమూరిని ఒక ఉతుకు ఉతికి ఆరేశారు.నిజానికి తెరపై ఉత్తమమైన రూపం కావాలి అంటే అనేక సర్జరీలు చాలా కామన్ అయిపోయాయి.
ఇటీవల కాలంలో ఆ విషయాన్ని మెగా ఫ్యామిలీ( Mega Family )కి చాలా దగ్గర వ్యక్తి కాబట్టి యండమూరి ఏదో సరదాగా చెప్పాడు.దాన్ని మెగా ఫ్యామిలీ సీరియస్ గా తీసుకుంది.

ఇప్పుడు అదే యండమూరి చిరంజీవి కోసం ఆత్మకథ రాయాలి అంటూ చెప్పడం చాలా విడ్డూరంగా అనిపించింది.ఒకవేళ ఆ యండమూరి నిజంగానే ఆత్మ కథ రాయాలి అంటే పూర్తిస్థాయిలో నిజాలు చెప్పే దమ్ముందా చెప్తే చిరంజీవి ఒప్పుకుంటాడా ? లేదంటే ఆయన అభిమానులు వదిలేస్తారా ? ఇన్ని సందేహాల మధ్య ఈ ఆత్మకథ ఎటు వెళుతుంది.







