గాడ్ ఫాదర్ హిట్ తో మెగాస్టార్ చిరంజీవి సూపర్ జోష్ లో ఉన్నారు.ఆచార్య ఫ్లాప్ తో డీలా పడ్డ చిరు గాడ్ ఫాదర్ తో తను అనుకున్న సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా విషయంలో చిరంజీవి ఫార్ములాలు అన్ని సక్సెస్ అయ్యాయి.గాడ్ ఫాదర్ హిట్ తో ఖుషిగా ఉన్న చిరు అదే జోరుతో తన నెక్స్ట్ సినిమా వాల్తేర్ వీరయ్య సినిమా చేస్తున్నాడు.
కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరు మాస్ ట్రీట్ మెగా ఫ్యాన్స్ కి పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు.లీకైన ఫోటోలు ఇప్పటికే వాల్తేర్ వీరయ్య మీద అంచనాలు పెంచాయి.
ఇక ఈ సినిమా నుంచి ఓ సూపర్ అప్డేట్ దీపావళి రోజు వస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం థియేటర్ లో గాడ్ ఫాదర్ సందడి చేస్తున్నా సరే వాల్తేర్ వీరయ్య ఫస్ట్ లుక్ టీజర్ దీపావళికి వస్తుందని అంటున్నారు.ఈ దీపావళి మరోసారి మెగా ఫ్యాన్స్ కి సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు.
వాల్తేర్ వీరయ్య మెగా ఫ్యాన్స్ అందరి అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్.మెగా ట్రీట్ అందించేందుకు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సిద్ధం అవుతున్నారు.