సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా 40 కంటే ఎక్కువ సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించడం సులువైన విషయం కాదు.సినిమాల్లో చిరంజీవి ( Chiranjeevi )ఎప్పటికీ మగధీరుడే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాల్లో చిరంజీవి సంచలనాలు సృష్టించకపోయినా సినిమాల్లో చిరంజీవి సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.నేటి తరం యంగ్ హీరోలలో చాలామంది హీరోలు చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చారు.
చిరంజీవి తన సినిమాల ద్వారా సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు.ఆరు పదుల వయస్సులో కూడా ఎనర్జీ, గ్రేస్ ఏ మాత్రం తగ్గకుండా తన నటనతో , డ్యాన్స్ లతో, ఫైట్స్ తో మెగాస్టార్ అభిమానులకు దగ్గరవుతున్నారు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ చిరంజీవి కెరీర్ పరంగా ఈ స్థాయికి ఎదిగారు.మెగా ఫ్యామిలీ హీరోలు సినిమాల్లో సక్సెస్ సాధించడం వెనుక చిరంజీవి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.

తన సినీ కెరీర్ లో చిరంజీవి వేర్వేరు పాత్రల్లో నటించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.1980లో చిరంజీవి నటించిన మొగుడు కావాలి మూవీ ( Mogudu Kavali )మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డులకెక్కిందని సమాచారం.ప్రజారాజ్యం పార్టీ కోసం చిరంజీవి ఏర్పాటు చేసిన తిరుపతి సభకు అప్పట్లో ఏకంగా 10 లక్షల మంది హాజరయ్యారు.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి.

2007 తర్వాత తనపై వచ్చిన విమర్శలకు ఖైదీ నంబర్ 150 ( Khaidi No.150 )సినిమాతో సమాధానం ఇచ్చారు.ఈ సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ప్రపంచం గర్వించే సినిమాలలో నటించిన చిరంజీవి భవిష్యత్తులో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.చిరంజీవి కొత్త సినిమాలు సైతం భారీ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.







