ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఓ ఆటో డ్రైవర్( Auto driver ) ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోసిన ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుని స్థానికంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.అసలు ఏం జరిగిందో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ నగరంలోని కూడా మహాలక్ష్మీ నగర్ లో యాదగిరి( Yadagiri )(40) తన భార్య లక్ష్మి, తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
యాదగిరి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.యాదగిరి తరచూ ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవాడు.
భర్త వేధింపులు భరించలేకపోయినా భార్య లక్ష్మీ ఆరు నెలల కిందట భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లి ఈ మధ్యనే తిరిగి వచ్చింది.
తాజాగా సోమవారం మధ్యాహ్నం యాదగిరి భార్య లక్ష్మీ స్థానిక స్కూల్లో చదువుకుంటున్న కూతుర్ని తీసుకురావడానికి స్కూలుకు వెళ్ళింది.
ఆ సమయంలో వారి ఇంటి సమీపంలో ఉండే ఆది( Adi ) (9) అనే బాలుడిని వెంట తీసుకొని యాదగిరి స్కూల్ దగ్గరకు వెళ్ళాడు.స్కూల్ లోపల ఉన్న తన భార్యను పిలవాలని ఆదికి పురమాయించాడు.
కోపంగా ఉన్న యాదగిరి దాడి చేస్తాడేమో అని భయపడిన స్కూల్ ఆయాలు లక్ష్మిని స్కూల్లో నుండి బయటకు పంపలేదు.
దీంతో ఆగ్రహానికి లోనైన యాదగిరి, ఆది మీద దాడి చేసి జేబులో ఉన్న కత్తి తీసుకొని బాలుడు గొంతు కోస్తుండగా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.కానీ వారిని బెదిరించి బాలుడి గొంతు కోసి యాదగిరి అక్కడి నుండి పారిపోయాడు.స్థానికులు తీవ్ర గాయాలైన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉండే సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి ఆటో డ్రైవర్ ను రాత్రి అదుపులోకి తీసుకున్నారు.