సుమ షోలో 'వాల్తేరు వీరయ్య'.. పిక్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య‘.ఈ సినిమా మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసేందుకు సిద్ధం అవుతుంది… 2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi In Suma Show, Suma Show, Anchor Suma, Megastar Chiranjeevi,-TeluguStop.com

బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ ఎప్పుడో స్టార్ట్ చేశారు.ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, పాటలు మంచి ఆసక్తి రేపగా.

రేపు ట్రైలర్ రాబోతుంది.దీంతో అంచనాలు పీక్స్ కు చేరడం ఖాయం.

ఇదిలా ఉండగా మెగాస్టార్ కూడా ఇక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ సుమ చేస్తున్న ప్రోగ్రాం కు గెస్ట్ గా విచేసినట్టు తెలుస్తుంది.రీసెంట్ గా సుమ మరొక కొత్త షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.‘సుమ అడ్డా‘ లోకి మెగాస్టార్ గ్రెస్ చేసినట్టు ఒక పిక్ తో కన్ఫర్మ్ అయిపొయింది.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ ఎపిసోడ్ లో చిరుతో పాటు డైరెక్టర్ బాబీ కూడా వచ్చారని తెలుస్తుంది.ఈ ఎపిసోడ్ జనవరి 14న ఈటీవీలో టెలికాస్ట్ కాబోతుందట.అంటే వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కాబోతుంది.

ఆ తర్వాత రోజు సుమ షోలో మెగాస్టార్ చేయబోయే సందడి చూస్తాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube