మెగాస్టార్‌తో గీతగోవిందం మేకర్‌, ఏ సినిమానో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి సైరా చిత్రం కోసం చాలా సమయం తీసుకున్నాడు.ఆ చిత్రం ఆలస్యం అయిన కారణంగా తదుపరి చిత్రాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ చకచక పూర్తి అయ్యేలా చూస్తున్నాడు.

 Megastar Chiranjeevi In Lucifar Remake Movie Direct In Parushuram-TeluguStop.com

ప్రస్తుతం తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయబోతున్నారు.

ఇక చిరు తన 153వ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు అప్పుడే ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

Telugu Chiranjeevi, Geethagovindam-Movie

మలయాళి హిట్‌ మూవీ లూసీఫర్‌ చిత్రంను మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నాడు.ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తాడని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తాడని చెబుతున్నారు.

ఈయన గీత గోవిందం చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

గీత గోవిందం చిత్రంతో సూపర్‌ హిట్‌ అయినా కూడా పరుశురామ్‌ తదుపరి చిత్రాన్ని ఇంకా మొదలు పెట్టలేదు.

త్వరలోనే నాగచైతన్యతో ‘నాగేశ్వరరావు’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టకుండానే తదుపరి చిత్రం ఒప్పందం చేసుకున్నాడు.

లూసీఫర్‌ చిత్రంను దర్శకుడు పరుశురామ్‌ అయితే బాగా రీమేక్‌ చేస్తాడని భావిస్తున్నారట.

Telugu Chiranjeevi, Geethagovindam-Movie

ఈ రీమేక్‌లో చిరంజీవితో పాటు చరణ్‌ కూడా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మలయాళంలో సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది కనుక ఇక్కడ కూడా అదేవిధంగా దుమ్ము లేపడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతటి క్రేజీ ప్రాజెక్ట్‌కు పరుశురామ్‌ దర్శకత్వం వహించబోతుండటం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube