తెలుగు సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో వాళ్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు చిరు.
ఈ సినిమా విడుదల సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో( Bhola Shankar ) నటిస్తున్న విషయం తెలిసిందే.

మొహర్ రమేష్( Director Mehar Ramesh ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు.తాజాగా మెగాస్టార్ చిరు లీక్స్ ద్వారా మరో అప్డేట్ ని విడుదల చేశారు.తాజాగా చిరు తమన్నా లతో( Tamanna ) కలిసి చిత్ర యూనిట్ సాంగ్ ను షూట్ చేసింది.
ఈ మేరకు చిరంజీవి అప్డేట్ అందించారు.

ఆ లోకేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు మెగాస్టార్.స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ చిరు లీక్స్ ఫోటోస్ మీకోసం అంటూ రాసుకొచ్చారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు చిరు లీక్స్ ద్వారా మెగాస్టార్ పంచుకుంటూ ఉండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.
చిరు విడుదల చేసే ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.కాగా ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.







