మెగా మేకర్ ఎంఎస్ రాజు( M.S.Raju ) రచన దర్శకత్వం వహించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి.ఈ సినిమాలో పవిత్ర లోకేష్, నటుడు నరేష్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
యూనిక్ కథతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ నిర్మించిన మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది.
కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఇందులో భాగంగానే తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న పవిత్ర లోకేష్( Pavitra lokesh) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా విలేకర్లు అడిగే ప్రశ్నలకు ఓపికంగా సమాధానం తెలిపింది.చాలా విరామం తర్వాత మళ్ళీ పెళ్లి సినిమాలో మళ్ళీ హీరోయిన్ గా చేయడం ఎలా అనిపించింది అని ప్రశ్నించగా.
పవిత్ర లోకేష్ స్పందిస్తూ.నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రల పై ద్రుష్టి పెట్టాను.కానీ హీరోయిన్ గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు.నా కెరీర్ మొదట్లోనే సుప్రసిద్ధ దర్శకులు గిరీష్ కాసరవెల్లి గారు నన్ను కథానాయికగా చేసి రెండు సినిమాలు చేయడం నా అదృష్టం.
తర్వాత నాకు వచ్చిన, నచ్చి పాత్రలు చేసుకుంటూ వచ్చాను.

ఇప్పుడు మళ్ళీ పెళ్లి సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను.నరేష్ ( Naresh )గారు చెప్పినట్లు హీరో హీరోయిన్ అనుకుంటే హీరో హీరోయిన్ అనుకోవచ్చు.ఎలా కన్సిడర్ చేస్తారనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అని నవ్వుతూ తెలిపింది.
మళ్ళీ పెళ్లి బయోపిక్ అనుకోవచ్చా ? అని ప్రశ్నించగా పవిత్ర లోకేష్ స్పందిస్తూ.బయోపిక్ అనేది చాలా పెద్ద వర్డ్.
మళ్ళీ పెళ్లి కథ సమాజానికి అద్దం పడుతుంది.ఇలాంటి పరిస్థితులు, ఆలోచనలు సమాజంలో ఉన్నాయి.
ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు అని తెలిపింది పవిత్ర లోకేష్.ఇది ఎవరికైనా టార్గెట్ చేయడానికి తీసిన సినిమానా అని ప్రశ్నించగా.
పవిత్ర మాట్లాడుతూ.లేదండీ,ఒకరిని టార్గెట్ చేయడానికి సినిమా తీయాల్సిన అక్కర్లేదు అని చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.







