ప్రెజెంట్ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికి ఇదే అనిపిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి తనకు జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.ఎందుకంటే చిరు నటించిన గత సినిమా ‘ఆచార్య‘.ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలవడమే కాదు.భారీ నష్టాలను కూడా తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరక్టర్ కొరటాలపై ఇండైరెక్ట్ పంచులు చాలానే వేశారు.
కొరటాలపై విమర్శలు చేయడంతో చిరు మీద ట్రోల్స్ వచ్చాయి.మరి ఈ ట్రోల్స్ విషయం తన దాకా వెళ్లడంతో చిరు అలెర్ట్ అయ్యాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పుడు సంక్రాంతి కానుకగా చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.అయితే ఇప్పటి వరకు చిరు ఈ సినిమా డైరెక్టర్ బాబీని ఎక్కడ పొగడలేదు.కానీ తాజాగా ఎక్కడ ప్రమోషన్స్ లో పాల్గొన్న బాబీని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నాడు.
మరి ఈయన పొగడ్తలు కురిపించడానికి కారణం చిరుపై వచ్చిన ట్రోల్స్ అని అంతటా టాక్ వస్తుంది.ఆచార్య సమయంలో కొరటాలపై చేసిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసే పనిలో మెగాస్టార్ పడినట్టు తెలుస్తుంది.

అందుకే స్టేజ్ మీద ఇకపై డైరెక్టర్ లను విమర్శించకూడదు అని ఆలోచనకు వచ్చినట్టు టాక్.ఇక సంక్రాంతి బరిలోకి దిగిన వాల్తేరు వీరయ్య ఇప్పటికే 108 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తుంది.రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో పండుగ రోజులను ఈ సినిమా క్యాష్ చేసుకుంది.మెగాస్టార్-రవితేజ కలిసి ఈ సినిమాలో రచ్చ రచ్చ చేసి ఆడియెన్స్ ను మెప్పించారు.
మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.







