ఆచార్య సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి,రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

 Megastar Chrianjeevi Acharya Child Artist Belongs Mandamrri Telangana Details,-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విజయం పట్ల పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి.భారీ అంచనాలు పెట్టుకున్న మెగాస్టార్ అభిమానులకు ఈ సినిమా బోలెడంత నిరాశనే మిగిల్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్ నటించిన విషయం తెలిసిందే.మందమర్రికి చెందిన డాక్టర్‌ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్‌ శ్రేయాష్‌.

ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు.మిథున్‌ సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు.ఇక ఆచార్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా శ్రీధర్ మిత్రుడు విజయ్ కుమార్ కు తెలిసిన వారి ద్వారా ఈ సినిమాకు వాళ్ళని పరిచయం చేయడం జరిగింది.ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో డైలాగులు బాగా చెప్పడంతో నటించడానికి ఎంపిక చేసుకున్నారు.

రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాడు.

Telugu Acharya, Acharyachild, Child Artist, Koratala Shiva, Mandamarri, Chiranje

చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్‌ సదానందం తెలిపాడు.పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలుడిని అభినందించారు.ఆచార్య సినిమా విషయానికి ఈ సినిమాలో రామ్ చరన్ సిద్ధ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

నేడు బారి అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అయిందీ.మెగా అభిమానులు ఎప్పడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎదురు చూసారు.చివరికీ ఆ రోజు రానే రావడంతో థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube