ఆచార్య ప్లాప్ ని మరిచిపోలేకపోతున్న చిరు.. నేనూ బాధితుడినే అంటూ ఇన్ డైరెక్ట్ చురకలు?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సినిమాలు అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోవడం.అయితే తాజాగా ఇదే వ్యవహారంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Mega Star Chiranjeevi Sensational Comments On Directors , Chiranjeevi , Sensatio-TeluguStop.com

తాజాగా ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లోకి వస్తారని, కాబట్టి దర్శకులు కథపై బాగా కసరత్తు చేయాలని, భారీ తారాగణం, హిట్ కాంబినేషన్, క్యాల్షిట్స్ దొరికాయి అని సినిమాలు హడావిడిగా తీయవద్దు అని చిరంజీవి కోరారు.

సినిమా సక్సెస్ అవ్వడానికి గట్టెక్కడానికి ప్రధాన కారణం దర్శకులదే అని చిరంజీవి తెలిపారు.కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఆడదని అందుకు తాను కూడా ఒక బాధితుడినే అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.

కేవలం ఒక దర్శకుడు పైనే ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయని, ఒకవేళ ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ అయితే ఎంతో మంది జీవితాలు తలకిందులు అవుతాయి అని మెగాస్టార్ చిరంజీవి హెచ్చరించారు.కాగా మెగాస్టార్ ఈ ఈవెంట్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు దర్శకుడు కొరటాల శివను ఉద్దేశించి చేశారు అంటూ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Acharya, Chiranjeevi, Directors, Koratala Siva, Tollywood-Movie

కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా ఘోరమైన డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.ఆచార్య సినిమా పరాజయాన్ని చిరంజీవి మర్చిపోలేక పోతున్నారు.క్రమంలోనే ఇటీవల విడుదల అయినా లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube