మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ వాల్తేరు వీరయ్య .వింటేజ్ లుక్స్ , చిరంజీవి యాక్టింగ్ , కోన వెంకట్ స్క్రీన్ ప్లే , రామ్ లక్ష్మణ్ ఫైట్స్ , మెగా స్టార్ యాక్టింగ్ , రవితేజ ఎనర్జీ , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఇక ఈ మూవీ చూసిన అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలి అని కోరుకుంటున్నారో , అలా చూసాము అని చెబుతున్నారు .సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకుల దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది .ఇక ఈ సినిమా లో మరో ప్లస్ పాయింట్ మాస్ మహారాజ్ రవితేజ యాక్టింగ్ , అలానే చాలా లాంగ్ గ్యాప్ తరువాత రవితేజ – మెగా స్టార్ చిరంజీవి తో కలిసి నటించడం ,ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సీన్స్ ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేశాయి .

ఇక అసలు విషయానికి వస్తే .ప్రస్తుతం .మెగా గాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత మాస్ అవతారంలో కనిపించి థియేటర్లలో రచ్చ చేశారు.ఇక ఈ సినిమా ఉదయం నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని సంచలన విజయం సాధించింది.ఇక ఇటీవలే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది మూవీ యూనిట్ .ఇక మంగళవారం ఈ మూవీ సక్సెస్ పై మీడియోకు ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది మూవీ యూనిట్.ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్ .అల్ల్లు అర్జున్ స్టార్ గా ఎదుగడం చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది అన్నారు .

కెరీర్ పరంగా అల్లు అర్జున్ ఎదుగుతున్న విధానాన్ని చూస్తుంటే చాలా ఎంతో మచ్చటేస్తోందని అన్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఎంతో కష్టపడుతున్న బన్నీ.ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప క్రేజ్ అందుకోవడం అంటే అంతా ఈజీ కాదు , ఈ కష్టం వెనుక చాలా శ్రమ దాగి ఉన్నది ,ఇది ఒక్కరోజు సక్సెస్ కాదు , అల్లు అర్జున్ సినిమా సినిమాకు తాను ఎదుగుతున్నాడు అలా తన పరిధిని కూడా పెంచుకుంటూ ఉంటున్నాడు , ఇక చివరిగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ మరింత ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయం అని.అలానే అల్లు అర్జున్ కి నా ఆశీస్సులు ఎల్ల ఎప్పుడూ ఉంటుంది అని వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ లో తెలియ జేశారు .







