మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య‘.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధం అవుతుంది.
బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుంది.దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది అని ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇక చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో మరింత ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
రవితేజ, మెగాస్టార్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక వీరిద్దరి కాంబోలో ఒక మాస్ సాంగ్ ఉంది అని తెలిసిందే.
పూనకాలు లోడింగ్ అనే మాస్ బీట్ సాంగ్ ను డైరెక్టర్ బాబీ అద్భుతంగా కంపోజ్ చేయించారు.నిన్న ఈ సాంగ్ రిలీజ్ చేసారు.
ఇక ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవల్ ల్లో ట్రీట్ ని ఇచ్చింది.ముఖ్యంగా ఈ సాంగ్ లో బాస్ ఎనర్జీ చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

చిరు 67 ఏళ్ల వయసులో కూడా తన రెండు దశాబ్దాల క్రితం చేసిన జై చిరంజీవ, అందరివాడు, ఠాగూర్ వంటి చిత్రాలను గుర్తు చేస్తున్నాడు.ఒకప్పటి బాస్ ఎనర్జీని చూసి మెగా ఫ్యాన్స్ డైరెక్టర్ బాబీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మెగాస్టార్ డ్యాన్స్ ఇన్నేళ్ల తర్వాత ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది.మొత్తంగా ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ కనిపించడం ఖాయం అని తేలిపోయింది.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
చూడాలి సంక్రాంతికి చిరు ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో.







