తెలంగాణ వ్యాప్తంగా 921 మంది ప్రభుత్వ డాక్టర్లు నియామకం అయ్యారు.ఈ మేరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నీళ్లు, నిధులు వచ్చాయి.ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
కరోనా సమయంలో చాలా మంది కాంట్రాక్ట్ విధానంలో పని చేశారని తెలిపారు.ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో కష్టపడ్డ డాక్టర్లకు 20 మార్కులు వెయిటేజ్ ఇచ్చామని పేర్కొన్నారు.
అదేవిధంగా ట్రైబల్ ఏరియాలు, మారుమూల పల్లెల్లో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు.నూతనంగా నియామకమైన వైద్యులు రేపే విధుల్లో చేరాలని సూచించారు.
వైద్యులు పేదలకు అందుబాటులో ఉండాలని, రెండు, మూడేళ్లు పోస్టింగ్ ఇచ్చిన చోటే పని చేయాలని తెలిపారు.నూతన వైద్యులు ట్రాన్స్ ఫర్ల కోసం ప్రయత్నాలు చేయొద్దని పేర్కొన్నారు.







