మెగా ప్రిన్స్ సినిమా మొత్తం అక్కడేనా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని తో షాక్ తినగా త్వరలో రాబోతున్న F3తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన F3 సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు.

 Mega Prince Varun Tej Next Movie Shooting In London Praveen Sattaru , F3, Ghost-TeluguStop.com

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా బాటియా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు.సినిమాలో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ కూడా నటించిందని తెలిసిందే.

ఇదే కాదు F3లో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ కూడా మరింత క్రేజీగా మారుతుంది.

ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొత్తం లండన్ లోనే షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది.సినిమాని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా పూర్తి కాగానే వరుణ్ తేజ్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

ఇదేకాదు మరో రెండు కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట.గని తో నిరాశపరచిన వరుణ్ తేజ్ ఎలాగైనా సరే మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube