వరుణ్‌, లావణ్యల ప్రేమ, పెళ్లి విషయంపై మెగా కాంపౌండ్ స్పందన ఏంటి?

హీరోల గురించి పుకార్లు రావడం కామన్ విషయం.అయితే హీరోల ప్రేమ మరియు పెళ్లి వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి.

 Mega Hero Varun Tej And Lavanya Tripathi Love And Marriage Issue  , National Med-TeluguStop.com

కొన్ని పుకార్లు నమ్మడానికి నిజంగా ఉండక పోవచ్చు, కానీ హీరోల పెళ్లి వార్తల్లో నిజం లేకున్నా కూడా అభిమానులు నిజమేనేమో అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ నమ్ముతూ ఉంటారు.ఈ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది.

పలు సందర్భాల్లో వారిద్దరు కూడా తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.ఇప్పుడిప్పుడే వారిది ప్రేమ కాదు స్నేహం అనుకుంటూ ఉండగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి వరుణ్ తేజ్ ( Varun Tej )మరియు లావణ్య త్రిపాఠి ల యొక్క ప్రేమ వివాహానికి వచ్చే నెలలో నిశ్చితార్థం జరగబోతోంది అంటూ వార్తా కథనాన్ని ప్రచురితం చేసింది.

దాంతో మెగా అభిమానులంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇన్నాళ్లు పుకార్లే అయి ఉంటాయి అనుకున్న వార్త నిజమే అంటూ తేలడంతో మెగా అభిమానులు కూడా షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Telugu, Varun Tej-Movie

మెగా బ్రదర్ నాగబాబు( Naga Babu ) తనయుడు అయినా వరుణ్ తేజ్ పెళ్లి విషయమై మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.వారు లావణ్య త్రిపాఠి ని అంగీకరిస్తారా లేదా అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.లావణ్య త్రిపాఠి గతం లో వరుణ్ తేజ్ తో కలిసి సినిమాల్లో నటించింది.ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని.రహస్యంగా ప్రేమించుకుంటున్నారని తెలుగు మీడియా లో కథనాలు వస్తున్నాయి.

ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది.

Telugu Telugu, Varun Tej-Movie

వివాహా నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ సదరు జాతీయ మీడియా సంస్థ( National Media Corporation ) ఇచ్చిన కథనం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.బయట జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.కానీ ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.

పరిస్థితి చూస్తుంటే వివాహ నిశ్చితార్థ వార్త నిజమే అయి ఉంటుంది అనిపిస్తుంది.ఎందుకంటే మెగా కాంపౌండ్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట.

అంతే కాకుండా ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ కి చెందిన ఏ ఒక్కరు కూడా ఈ వార్త నిజం కాదు అని చెప్పేందుకు ముందుకు రావడం లేదు.కనుక వారిద్దరి ప్రేమ విషయం నిజమే అయ్యుంటుంది.

పెళ్లి కూడా త్వరలో ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube