మెగా కాంపౌండ్ నుంచి చరణ్ తండ్రి కాబోతున్నారనే వార్త ఎప్పుడెప్పుడు వింటామా అని అభిమానులు ఒక దశాబ్ద కాలం నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయింది.
ఇప్పటివరకు వీరు పిల్లల గురించి ఏ విషయం చెప్పకపోవడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూడటమే కాకుండా ఈ విషయంలో నిరాశ కూడా వ్యక్తం చేశారు.ఇలా 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అధికారకంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయం క్షణాల్లో వైరల్ అవ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఉపాసన రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి మెగా డాటర్ శ్రీజ సుస్మిత స్పందించారు.ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి వీరిద్దరూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సుస్మిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్తగా మారడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను మరి నువ్వు అంటూ శ్రీజను ట్యాగ్ చేసింది.ఇందుకు శ్రీజ రిప్లై ఇస్తూ నేను కూడా అత్తగా మారడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడమే కాకుండా చిందులు వేస్తూ ఉన్నటువంటి ఎమోజీలను షేర్ చేశారు.మొత్తానికి రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారనే వార్త మెగా ఫ్యామిలీలో అందరిని ఎంతో ఆనందానికి గురి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున మెగా ఇంట్లో సంబరాలు కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది.







