ఆ వివాదాలపై నోరు విప్పిన మెగా డాటర్ నిహారిక.. అలా చెబితే కొట్టేస్తా అంటూ?

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా మెగా డాటర్ నిహారిక వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.వెబ్ మీడియా, సోషల్ మీడియాలో నిహారిక గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి.

 Mega Daughter Niharika Shocking Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

నిహారిక సైతం వివాదాలకు, మీడియాకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా ఒక న్యూస్ ఛానల్ కు నిహారిక తల్లి పద్మజ, నిహారిక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో పద్మజ, నిహారిక ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

నిహారికపై వార్తలు వచ్చిన సమయంలో మొదట కాస్త బాధగా అనిపించిందని ఆమె తెలిపారు.

మాకున్న దానిలో ఎవరూ ఏమీ చేయలేరని అలా అంటే తలుపులు వేసుకొని ఉండాలని ఆమె తెలిపారు.తప్పు చేయని పక్షంలో బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్లు చేశారు.

నిహారిక ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ఏదైనా అన్నా బాధ అనిపించని మేం ఏంటో మాకు తెలుసని ఆమె తెలిపారు.

Telugu Niharika, Padamaja, Youtubethumb-Movie

ఎప్పుడైనా ఎవరైనా బాగున్నారంటే వాళ్లపై రాయి వేయాలని వాళ్ల మనసును బాధ పెట్టాలని చూస్తుంటారని ఆమె చెప్పుకొచ్చారు.మా బావగారు ఉన్నంత వరకు మాకేం పరవాలేదని పద్మజ పేర్కొన్నారు.నిహారిక భర్త కూడా ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి అని పద్మజ చెప్పుకొచ్చారు.

నిహారిక ఆ వార్తల గురించి స్పందిస్తూ తాను వార్తలను అస్సలు చూడనని కామెంట్లు చేశారు.యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తాను చూడనని ఆమె తెలిపారు.ఇన్ స్టాగ్రామ్ లో వచ్చే కామెంట్లను అస్సలు పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు.నాపై ఎన్నైనా రాసుకోండని నాకు ఏ మాత్రం ఫరక్ పడదని ఆమె చెప్పుకొచ్చారు.

ఎవరూ నా ముఖం మీదకు వచ్చి చెప్పరని ఒకవేళ చెబితే మేం కొట్టేస్తాం అని ఆమె తెలిపారు.నిహారిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube