హింసే మార్గం అంటూ కత్తి పట్టిన నాగబాబు... వైరల్ అవుతున్న పోస్ట్!

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నాగబాబు(Nagababu) ఒకరు.ఈయన నటుడిగా, నిర్మాతగా పలు సినిమాలలో నటించారు.

అయితే నాగబాబు ప్రస్తుతం సినిమాలలో కన్నా రాజకీయాల(Politics) పైనే చాలా ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన పార్టీ (Janasena Party) లో కీలక బాధ్యతలు చేపట్టారు.

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబును ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.నాగబాబు రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇలా జనసేన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన నాగబాబు కొన్నిసార్లు ఈయన నోటి దురుసు కారణంగా చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదాలకు కారణం అవుతుంటాయి.ఈయన తరచూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.అయితే కొన్నిసార్లు నాగబాబు వ్యవహార శైలి కారణంగా జనసేన నాయకులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు.

Advertisement

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవ్వడమే కాకుండా పలు చర్చలకు కూడా కారణం అవుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా వేట కొడవలి చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసిన నాగబాబు మంచి అనేది ఎప్పుడైతే విఫలం చెందుతుందో అప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం అంటూ క్యాప్షన్ పెట్టారు.ఇలా ఈయన హింసే మార్గం అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఇది ఏదైనా సినిమాల ప్రమోషన్లలో భాగమ లేకపోతే ఈయన అధికార పార్టీని ఉద్దేశించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారా అన్న విషయం తెలియడం లేదు.

ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పలు చర్చలకు కారణమైంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు