మెగా బ్రెయిన్: చిరు 'రాజకీయం'పై అసలు నిజం ఇదే ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.

అయితే కొంతకాలంగా చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో చక్కెర్లు కొడుతున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి కలవడం, సినిమా ఫంక్షన్లలో జగన్ ను అదేపనిగా పొగడడం, జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి చిరంజీవి మద్దతు ప్రకటించడం ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.దీంతో మెగాస్టార్ చిరంజీవి వైసీపీలోకి వస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అలాగే ఆయనకు జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు అని కూడా ప్రచారం జరిగింది.

ఇటీవల బీజేపీతో సఖ్యతగా ఉంటున్న వైసీపీకి కేంద్రం రెండు, మూడు మంత్రి పదవులు ఆఫర్ చేసిందని, అందులో ఒక మంత్రి పదవిని చిరంజీవికి కట్టబెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఈ ప్రచారంపై అటు చిరంజీవి గాని, ఇటు జగన్ గాని స్పందించకపోవడంతో రకరకాల కథనాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.పవన్ కు చెక్ పెట్టేందుకే చిరుని జగన్ వాడుకుంటున్నారని, ఏపీలో కాపు ఓట్లు చెక్కుచెదరకుండా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని, ఇలా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

గతంలో చాలా సందర్భాల్లో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళేది లేదని, అసలు రాజకీయాల్లోకి వెళ్లి చాలా తప్పే చేశానని కూడా చెప్పారు.పదేళ్లపాటు సినిమాల్లో నటించి ఇక తప్పుకుంటానని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకున్నారు.

కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు లేని లోటుని తీర్చేవిధంగా ఆయన ప్రయత్నిస్తున్నారు.రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరు చెప్పినప్పటికీ రాజకీయ పరమైన కొన్ని అంశాల్లో తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా వెల్లడిస్తున్నారు.

దీని వెనుక చిరంజీవికి చాలా వ్యూహమే ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

అంశాల వారీగా ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడంలో తనకంటూ ఒక ఆలోచన చిరంజీవికి ఉంది.ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి మార్కెట్ ఎక్కువ.

Advertisement

అందుకే రెండు ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉండడం వల్ల తమకు ఇబ్బంది ఉండదనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లుగా తెలుస్తుంది.అదీ కాకుండా చిరంజీవి అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ సి రెడ్డి కుటుంబానికి సైతం పరోక్షంగా రాజకీయ సంబంధాలు ఉండడంతో చిరంజీవి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు