సభ నిర్వహించి తీరుతా.. ఎవరికీ పోటీగా కాదు..అనిల్‌ కుమార్‌

నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది.రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ పరిశీలించారు.

 Meeting Will Be Held Not A Competition For Anyone Anil Kumar , Nellore , Ycp P-TeluguStop.com

ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు.రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు.

నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు.దీంతో.

నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం ముదురుతోంది.

మంత్రి కాకాణిపై వెనక్కి తగ్గని మాజీ మంత్రి అనిల్.

సభను నిర్వహించి తీరుతామంటున్నారు.

నియోజకవర్గం నుంచి మాత్రమే కార్యకర్తలు హాజరవుతారని.ఇది ఎవరికీ పోటీ సభ కాదు అన్నారు.3 రోజుల ముందే సభకు అనుమతి కోరినట్టు వెల్లడించారు.ఇక, సీఎం జగన్‌కు సైనికుడుగానే ఉంటానని స్పష్టం చేశారు.

సభ వాయిదా వేసుకోవాలని అధిష్టానం కూడా సూచించలేదన్నారు.ఎవరో కార్యక్రమం పెట్టారని నేను సభ పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్.

కాగా, అదే రోజు మంత్రి కాకాణి కోసం కూడా సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube