నిత్యానంద తోపు.. త్వరలోనే కైలాస దేశానికి వెళ్ళబోతున్నాను: నటి మీరామిథున్

నిత్యానంద పేరు తెలియని భారతీయులు ఉండరంటే నమ్మితీరాల్సిందే.

ఎంతో గౌరవ ప్రదమైన సన్యాసి అవతరమెత్తి, దేశవ్యాప్తంగా వున్న సన్యాసులకు (స్వాములకు) చెడ్డపేరు తెచ్చిన ఘనత మాత్రం నిత్యానందదే.

తన సన్నిధిలో గుట్టుగా సాగుతున్న చీకటి వ్యవహారాలు కొన్నేళ్ల క్రితం వెబ్ కెమెరాస్ ద్వారా ప్రపంచం మొత్తం తిలకించింది.తమిళ నటి రంజితతో నిత్యానంద తన బెడ్ రూములో నెరిపిన రాసలీలలు వార్తల్లో కెక్కిన సంగతి అందరికి విదితమే.

పలు కిడ్నాపులు, వేధింపులు, రేప్ కేసులలో అతన్ని అరెస్టు కూడా చేశారు.దాంతో నిత్యానంద ఆధ్యాత్మిక జీవితానికి శుభం కార్డు పడినట్లయింది.

కానీ, అక్కడితో ఖాళీగా వున్న కొందరు నిత్యానంద అనుచరులు, మరికొంతమంది భక్తులు కలిసి గొడవలు, ధర్నాలు చేసి తమ స్వామి పాతివ్రత్యాన్ని రుజువుచేసే ప్రయత్నాలు చేశారు.అయినప్పటికీ అప్పటి మీడియా చాలా బలంగా నిత్యానంద చర్యలను టెలికాస్ట్ చేయడంతో ప్రభుత్వలు కూడా అతన్ని ప్రధాన విక్టిమ్ కింద దోషిగా చూపించాయి.

Advertisement

కొన్నాళ్ళకు ఏం జరిగిందో తెలియదు కానీ.భారత్ నుంచి నిత్యానంద పారిపోయాడు.

అంతటితో ఆగకుండా ఏకంగా ఓ దీవిని కొనుగోలు చేసి, దానిని ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ పేరుని ప్రకటించాడు.ఇక దాన్ని ప్రత్యేక దేశంగా కూడా ప్రకటించినట్టు వార్తలు మిన్నంటాయి.

అలాగే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి కరెన్సీని కూడా ప్రవేశ పెట్టాడు.ఈ వార్తలు కూడా ప్రముఖ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.

ఇకపోతే.ఈ క్రమంలో మరో తమిళ నటి మీరామిథున్ నిత్యానందపై తన ప్రేమను ప్రకటించుకుంది.అందరూ కలిసి ఆయనను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఏది ఏమైనా నిత్యానందను ఏమి చేయలేకపోయారని, ఆయన సత్యవంతుడు అని అన్నారు.అక్కడితో ఆగకుండా త్వరలోనే నిత్యానందను కలుస్తానని, కైలాస దేశానికి కూడా వెళ్తానని చెబుతూ.నిత్యానందకు ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని ట్వీట్ చేసింది.

Advertisement

ఏమిటో వింత.ఎవరికీ అర్థంకాని స్వాములవారు ఈ తమిళ భామలకు అర్ధమయ్యారేమిటో.!.

తాజా వార్తలు