మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej )ఒక యాక్సిడెంట్ లో ప్రాణాపాయం నుంచి ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు ఆ సమయంలో వేగంగా స్పందించిన అబ్దుల్ పర్హాన్( Abdul farhan ) అనే వ్యక్తి వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు .ప్రాణాపాయం తప్పినప్పటికీ కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పట్టింది .
అయితే సాయిధర్మతేజ్ ను నువ్వు కాకాపాడటం వల్ల పర్హాన్ మాత్రం చాలా ఇబ్బందులు పడినట్లుగా తెలుస్తుంది.భారీ స్థాయిలో బహుమతులు డబ్బులు మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి వచ్చాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి ….
దాని గురించి ఎంక్వయిరీల కోసం, చాలామంది తనను ఫోన్లు చేసి విసిగించారని దాని మూలంగా తన జాబ్ కూడా పోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .మెగా ఫామిలీ నుంచి తనకు ఏ రకమైన బహుమతులు గాని డబ్బు గాని అంద లేదని, అదేమీ తాను ఆశించడం లేదని అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం తన బాధ్యత అనుకొని చేశానని చెప్పుకొచ్చాడు.

అయితే తాత్కాలికంగా విషయం సద్దుమణిగినప్పటికీ ఇటీవల తన సినిమా విడుదల సందర్భంగా మిమ్మల్ని కాపాడిన వ్యక్తికి మీరేమైనా సాయం చేశారా అన్న ప్రశ్నలకు డబ్బులు ఇచ్చి రుణం తీర్చుకోవాలని అనుకోలేదని ఆయనను కలిశానని, తన నెంబర్ ఇచ్చి వచ్చానని ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తానని, ఏ సాయం అవసరం.అయినా చేస్తానని చెప్పుకొచ్చారు.

ఈ పరిణామంతో మరొకసారి మీడియా ఫర్హాన్ వెంటపడింది సాయి ధరమ్ తేజ్ మమ్మల్ని కలిశాడా ఏదైనా సాయం చేస్తానని ఆఫర్ ఇచ్చాడా లాంటి ప్రశ్నలతో ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తుందిఇప్పటికే ఒకసారి వచ్చిన వార్తలతో తాను చాలా నష్టపోయానని తనకు ఏ రకమైన సహాయం మెగా ఫ్యామిలీ నుంచి అందలేదు , సాయి ధరమ్ తేజ్ తనలో కలవలేదని పరహాన్ క్లారిటీ ఇచ్చాడు , తనకు సహాయం చేసిన వ్యక్తికి ఏ రకమైన బదులు తీర్చుకోలేదంటూ మరొకసారి మీడియాలో వార్తలు రావడం మొదలయ్యింది.

ఈ వార్తలు సాయి ధరంతేజ్ వరకు వెళ్లడంతో మరొకసారి ఆయన క్లారిటీ ఇచ్చారు తన మేనేజర్ శరన్ ఫర్హాన్ తో టచ్ లో ఉన్నారని ఆయనకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని ఈ విషయంలో ఇదే చివరి వీడియో అని క్లారిటీ ఇచ్చారు .ఈ విషయంలో మీడియా అత్యుత్సాహంతో ఇరు పార్టీలు ఇబ్బంది పడినట్లుగా తెలుస్తుంది.







