మొబైల్ ఫోన్ ఛార్జర్ లపై ఉండే ఈ గుర్తులకు అర్థం ఏంటో తెలుసా..?

మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే ఛార్జర్ ( Mobile Charger ) ఎంతో కీలకం.ఛార్జర్లు మారిస్తే ఫోన్ దెబ్బతింటుందని చాలామందికి తెలిసిందే.

 Meaning Of Symbols On Mobile Charger Details, Symbols, Mobile Charger, Mobile Ch-TeluguStop.com

కాబట్టి చాలావరకు కంపెనీ ఛార్జర్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు.అయితే మొబైల్ ఛార్జర్ పై కొన్ని సింబల్స్ ఉంటాయి.

సింబల్స్ కి( Mobile Charger Symbols ) గల అర్థం ఏంటో మీకు తెలుసా.? ఆ సింబల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

డబుల్ స్క్వేర్:

ఈ సింబల్ మొబైల్ ఛార్జర్ వెనుక భాగంలో ఉంటుంది.ఈ సింబల్ డబుల్ ఇన్సులేటెడ్ ను( Double Insulated ) సూచిస్తుంది.

ఈ సింబల్ అర్థం మొబైల్ ఛార్జర్ లోపల ఉండే వైర్లు బాగా పూత పూయబడి ఉండడం వల్ల ఛార్జర్ నుండి విద్యుత్ షాక్ ను నివారించవచ్చు.కాబట్టి ఈ సింబల్ ఉండే ఛార్జర్ ను మాత్రమే కొనుగోలు చేయాలి.

ఈ సింబల్ లేకపోతే భద్రత లేదు అని గుర్తుంచుకోవాలి.

V సింబల్:

V అంటే రోమన్ భాషలో వ్రాయబడిన ఓ చిహ్నం.దీనికి అర్ధం 5. ఈ V సింబల్ మొబైల్ ఛార్జర్ యొక్క శక్తి స్థాయి సామర్థ్యాన్ని సూచిస్తుంది.

ఈ సింబల్ కేవలం కంపెనీ ఛార్జర్ లపై మాత్రమే ఉంటుంది.కొనుగోలు చేసేటప్పుడు ఈ సింబల్ ను గమనించి తీసుకోవాలి.

హౌస్ సింబల్:

ఈ సింబల్ అర్థం కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి.అంటే ఇంట్లో మాత్రమే 220 వోల్ట్ ల విద్యుత్ సరఫరా అవుతుంది.కాబట్టి 220 వోల్ట్ ల కంటే తక్కువ లేదా ఎక్కువ విద్యుత్ సరఫరా అయితే సురక్షితం కాదు.ఛార్జర్ పేలిపోయే అవకాశం ఉంది.

డస్ట్ బిన్ సింబల్:

ఈ సింబల్ కు అర్థం ఏమిటంటే.ఈ మొబైల్ ఛార్జర్ ను ఎట్టి పరిస్థితులలో డస్ట్ బిన్ లో వేయకూడదు.

చాలా రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ఈ సింబల్ ఉంటుంది.ఇవి పనిచేయకపోతే రీసైక్లింగ్ పాయింట్ కు ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube