Viplav K Keshava Rao : పార్టీ మారాలని కేకేపై మేయర్ ఒత్తిడి..!: కేకే కుమారుడు విప్లవ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్నారు.ఈ క్రమంలోనే సీనియర్ నేత కే కేశవరావు( K Keshava rao ), జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Vijayalaxmi Gadwal ) పార్టీ మార్పుపై కేకే కుమారుడు విప్లవ్ స్పందించారు.

 Mayors Pressure On Kk To Change Party Kks Son Viplav Politics-TeluguStop.com

ప్రస్తుత పరిస్థితుల్లో కేకే బీఆర్ఎస్ ను వీడడం సరికాదన్నారు.కష్టకాలంలో బీఆర్ఎస్ లో కొనసాగితే బాగుండేదని పేర్కొన్నారు.

వంద రోజుల్లోనే బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలు అయ్యాయన్న విప్లవ్ కేకేపై రాజకీయంగా ఒత్తిళ్లు ఉండవచ్చని చెప్పారు.అంతేకానీ పదవుల కోసం కేకే పార్టీ మారే అవకాశమే లేదని తెలిపారు.

పార్టీ మారాలని కేకేపై విజయలక్ష్మీ ఒత్తిడి చేశారని ఆరోపించారు.అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని మేయర్ చెప్పారని ఆరోపణలు చేశారు.అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆర్( KCR ) నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు.ఎవరైనా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube