బీఎస్పీ అధినేత్రి మాయావతి తనని రాముడు,సర్ధార్ వల్లభాయ్ పటేల్ లతో పోల్చుకున్నారు.అంటే వారి విగ్రహాల తో లేండీ.
పలు చోట్ల ఆమె విగ్రహాలు ఏర్పాటు చేయడం పై విమర్శలు రావడం తో ఆమె స్పందిస్తూ రాముడు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల విగ్రహాలతో ఆమెను ఆమె పోల్చుకున్నారు.యూపీ లో రాముడు విగ్రహాలు,సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే లేనిది నా విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని ఆమె ఎదురు ప్రశ్నించారు.
ఇటీవల ఏపీ లో జనసేన పార్టీ తో చేతులు కలిపి బీస్పీ పార్టీ ఏపీ రాజకీయాలలో తన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాయావతి విశాఖ లో పర్యటిస్తున్నారు.
ఈ నెల 11 న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నీ పార్టీల నేతలు తమ ప్రచారాలను ఉధృతం చేసారు.ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి.







