ఒకపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఎన్నికల ప్రచారం గురించి కాకుండా టీడీపీ నేతలు సినిమా విడుదల గురించే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు.ఇప్పుడు మీకు అర్ధమై ఉంటుంది ఆ చిత్రం ఏమిటో……అదే లక్ష్మీస్ ఎన్టీఆర్.
ఈ చిత్రం విడుదల కాకముందే ఎన్నో అంచనాలు మొదలైన సంగతి తెలిసిందే.బాలకృష్ణ కధానాయకుడు,మహానాయకుడు చిత్రాలను విడుదల చేసి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని చూసిన టీడీపీ పార్టీ కి ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పెద్ద తలనొప్పిగా మారింది.
అందులోనూ ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కావడం మరో తలనొప్పి.వేరే ఎవరైనా అయితే ఎదో విధంగా ఆ చిత్రాన్ని నిలిపివేసే వీలు ఉండేదేమో గానీ, మాట వినని సీతయ్య లాంటి వర్మ కావడం తో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అయితే ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేసినప్పటికీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విడుదల కాకుండా కొందరు టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.ఆ చిత్రం వాస్తవానికి విరుద్ధంగా ఉందని ఎన్నికల సమయంలో ఈ చిత్రం విడుదల అయితే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుంది అంటూ పలువురు టీడీపీ నేతలు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు.
అయితే ఈ పిటీషన్ పై ఈ రోజు హైకోర్టు లో విచారణ జరుగగా,ఈ నేపథ్యంలో ఆ చిత్రాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వీక్షించి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వీక్షించడం కోసం ప్రధాన న్యాయమూర్తుల తో పాటు ఆ చిత్ర ప్రొడ్యూసర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది.







