మహారాష్ట్ర నాగ్ పూర్ లోని సోలార్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు గాయపడ్డ బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.సోలార్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలోని కాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో పేలుడు జరిగింది.
ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తోంది.ప్యాకింగ్ కార్యకలాపాలు చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ సంభవించింది.
కాగా ఈ కంపెనీ భద్రతాదళాలకు ఆయుధాలతో పాటు డ్రోన్ లు సప్లై చేస్తుంది.మరోవైపు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.