తెలంగాణ, ఛత్తీస్గఢ్( Chhattisgarh, Telangana ) సరిహద్దుల్లో ఎన్కౌంటర్( Encounter) కలకలం సృష్టిస్తుంది.బీజాపూర్, బాసగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.డిప్యూటీ కమాండ్ సహా ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యం అయ్యాయి.
కాగా వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.
అయితే నిన్న బాసగూడలో పోలీసుల ఇన్ ఫార్మర్ల నెపంతో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు.
ఈ ఘటన తరువాత జవాన్లు, పోలీసులు బాసగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సమాచారం.