ఆ రచయిత నుంచి 5 కథలు కొనేసిన రవితేజ.. మాట తప్పకుండా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ కరోనా లాక్ డౌన్ తరువాత క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Mass Maharaja Ravi Teja Purchased Five Stories From Young Writer , Mass Maharaja-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే క్రాక్ సినిమా తరువాత ఖిలాడీ సినిమా విడుదల అయినప్పటికీ ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద గా తీవ్ర నిరాశ పరిచింది.అయితే ప్రస్తుతం రవితేజ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

రవితేజ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని రవితేజ నమ్మకంతో ఉన్నారు.అలాగే ఈ సినిమా తర్వాత తెరకెక్కబోయే ధమాకా సినిమా కూడా మంచి హిట్ సాధిస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఇదిలాఉంటే ఇటీవలే రవితేజ ఒక టాలెంటెడ్ రైటర్ నుంచి ఏకంగా ఐదు కథలను ఒకేసారి కొనేసినట్లుగా తెలుస్తోంది.

ఆ కాన్సెప్టులు అన్నీ కూడా బాగా నచ్చడంతో రవితేజ మరో ఆలోచన లేకుండా రచయితకి మొత్తంగా భారీ అమౌంట్ నే నచ్చజెప్పి ఆ అయిదు కథలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.మరి ఆ రైటర్ ఎవరో కాదు శ్రీకాంత్.

Telugu Mass Maharaja, Ramesh Verma, Ravi Teja, Tollywood, Youngwriter-Movie

ఖిలాడి సినిమాకు రైటర్ గా పని చేశాడు శ్రీకాంత్.దర్శకుడు రమేష్ వర్మ తో రవితేజకు విభేదాలు వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ ఈవెంట్ షో రవితేజ దర్శకుడి గురించి మాట్లాడకుండా పూర్తిగా రచయిత గురించి పాజిటివ్ గా స్పందించడం విశేషం.అంతే కాకుండా అతని కారణంగా సినిమా బాగా వచ్చిందని భవిష్యత్తులో కూడా ఆ రచయిత తన భవిష్యత్తు ప్రాజెక్టుల ఈ విషయంలో కూడా కొనసాగుతాడు అని రవితేజ తెలియజేశాడు.అప్పట్లో రవితేజ అన్నట్టుగానే ఆ రచయితకు ఒక మంచి అమౌంట్ ఇచ్చి అతని దగ్గర ఉన్న ఐదు కథలను ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ రచయిత ఆ ప్రాజెక్టుల స్క్రిప్ట్ డెవలప్ వర్క్స్ లో పని చేసి మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube